![]() |
![]() |

యూట్యూబ్ లో ఎన్నో ఛానెల్స్ ఉంటాయి. అందులో కొన్ని ట్రావెల్ వ్లాగ్స్, స్ట్రీట్ వ్లాగ్స్, రేసింగ్, గేమింగ్, టెక్నాలజీ వ్లాగ్స్, విలేజ్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద లిస్టే వస్తుంది. అయితే ఈ వ్లాగ్స్ కి ఎన్ని వ్యూస్ కి ఎంత మనీ వస్తాయనేది తెలియని వారికి ఓ ప్రశ్నగా ఉంటుంది. అలాంటిదే వివరిస్తూ జబర్దస్త్ నూకరాజు ఓ వ్లాగ్ చేసాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టిన ఒక్కో వ్లాగ్ కి ఎంత మనీ వచ్చిందో చెప్తూ మరో వ్లాగ్ చేశాడు. కాగా ఇప్పుడు ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తుంది.
ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు.
నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే నూకరాజుకి కొన్ని ఫోక్ సాంగ్స్ పాడి ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీళ్ళు తమ ఛానెల్ లో చేసే వ్లాగ్స్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. కొన్నిరోజుల క్రితం రాపిడో నడుపుకుంటున్న ఓ అమ్మాయికి తమకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న ఆసియా, నూకరాజులు.. యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా అది ఫుల్ వైరల్ అయింది. ఇక ఇప్పుడు తన వీడియోలకి ఎంత మనీ వస్తుందో వివరించాడు నూకరాజు. ఓ వీడియో మీద నాలుగువేలు వస్తే అందులో థంబ్ నెల్ కి అయిదు వందలు తీసుకుంటారంట.. కెమెరా, సౌండ్, ఎడిటింగ్... ఇలా అన్నీ కలిపి పదిహేను వందల నుండి రెండు వేల వరకు వెళ్ళిపోతుంది. ఇక మిగిలేది రెండు వేలు మాత్రమేనంటూ నూకరాజు చెప్పుకొచ్చాడు. ఇలా అత్యధిక వ్యూస్ వచ్చినవాటికి వచ్చే డబ్బులతో ఇలా సాయం చేస్తామని తమకి సపోర్ట్ చేయమని నూకరాజు ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |